వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్న కార్యక్రమం

నర్సీపట్నం జులై 18 ( స్పీడ్ న్యూస్)
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 'జగనన్న 2.0' సూపర్ యాప్ను నర్సీపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర గణేష్ శనివారం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యకలాపాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వంపై ప్రజల సమస్యలను నమోదు చేయడం, పార్టీ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించడం వంటి అనేక సేవలు ఈ సూపర్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రతి కార్యకర్త ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రజలకు ఉపయోగపడేలా వినియోగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు చింతకాయల సన్యాసిపాత్రుడు, జెడ్పీటీసీ గిరిబాబు, నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం మండలాల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, నర్సీపట్నం మండల, మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షులు లగుడు నాగేశ్వరరావు, కొరుపోలు పాణి, శాంతారాం, ఏకా శివప్రసాద్, శానాపతి వెంకటరత్నం, చిటికెల వెంకటరమణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత, మండల బూత్ కమిటీ అధ్యక్షులు కోనేటి రామకృష్ణ, యలమంచిలి రఘురాం, రుత్తల వాసు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.