జై హిద్ – జై శ్రీరాం శిఖరం టీం ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం ప్రవచనకర్త బ్రహ్మశ్రీ ఇంద్రకంటి వెంకట గోపాలకృష్ణ శర్మ పాల్గొననున్నారు

నర్సీపట్నం, జూలై 15:(స్పీడ్ న్యూస్)
నర్సీపట్నంలో ఈ నెల 19వ తేదీ (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు మెయిన్ రోడ్డులోని రుత్తల కన్వెన్షన్ హాల్‌లో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
జై హింద్ – జై శ్రీరాం శివోహం టీం, నర్సీపట్నం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ ఇంద్రకంటి వెంకట గోపాలకృష్ణ శర్మ పాల్గొని "బ్రహ్మ దేవతారాధన మరియు విగ్రహారాధన వేద విరుద్ధమా?" అనే అంశంపై ప్రత్యేక ప్రవచనం చేయనున్నారు.
వేదాలు, పురాణాలు మరియు శాస్త్రాల ఆధారంగా ఈ అంశాన్ని వివరిస్తూ సందేహాలకు సమాధానాలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆధ్యాత్మిక చింతనకు, వేద సారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై ప్రవచనాన్ని ఆస్వాదించాలని కోరారు.
ఈ కార్యక్రమానికి నర్సీపట్నం మరియు పరిసర ప్రాంతాల భక్తులు, వేదాభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.