అభివృద్ధి, సంక్షేమమే ఆకర్షణ.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ వాలంటీర్లు టీడీపీ కండువా కప్పి ఆహ్వానించిన పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్

​నర్సీపట్నం: ( స్పీడ్ న్యూస్ )అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రతిపక్ష వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. అధికార టీడీపీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైసీపీకి చెందిన 35 కుటుంబాలు మంగళవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. 28వ వార్డు అయ్యన్న కాలనీకి చెందిన మాజీ వాలంటీర్ కుండ్రపు దమయంతి ఆధ్వర్యంలో మాజీ వాలంటీర్ అడ్లబోయిన సత్యవేణితో పాటు 30 కుటుంబాల మహిళలు, అలాగే శివపురానికి చెందిన తాటికొండ ఫణికుమార్ ఆధ్వర్యంలో మరో 5 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి టీడీపీ టౌన్ అధ్యక్షులు చింతకాయల రాజేష్ పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
​ఈ సందర్భంగా పార్టీలో చేరిన మాజీ వాలంటీర్ దమయంతి మాట్లాడుతూ.. టీడీపీ సిద్ధాంతాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలోకి రావడం జరిగిందన్నారు. నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సృష్టి క్షేత్రాన్ని వైసీపీ నాయకులు అడ్డుకోవడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే కేవలం అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఈ చేరికల కార్యక్రమంలో 28వ వార్డు మాజీ కౌన్సిలర్ డబ్బిరి శ్రీకాంత్, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ, 28వ వార్డు టీడీపీ నాయకులు గాలి రమణ, బీజా రామ్ కుమార్, కొడవటి గోపి, కొవ్వాడ సంపత్, కుండ్రపు చిన్న, పసుపులేటి జ్యోతి, చెరుకూరి చంటమ్మ, పలువురు కాలనీ మహిళలు, యువత పాల్గొన్నారు.