నర్సీపట్నం, జూలై 13:(స్పీడ్ న్యూస్)
నర్సీపట్నం సిటీ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు సోమవారం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన సిటీ క్లబ్ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన పాలకవర్గ సభ్యులను రాజేష్ ఆత్మీయంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఆదివారం జరిగిన ఎన్నికల్లో సిటీ క్లబ్ అధ్యక్షుడిగా పిట్ల రాజేశ్వరరావు, కార్యదర్శిగా పోతల భాస్కరరావు, కోశాధికారిగా పెదిరెడ్ల కిరణ్ ఎన్నికయ్యారు. అలాగే సభ్యులుగా ఆర్.వి.పి. సత్యనారాయణ, కుప్పిలి శ్రీనివాసరావు, ధనిమిరెడ్డి శ్రీనుబాబు, పోలిపర్తి అప్పలనాయుడు, కలిగట్ల బాబూరావు, లంక చిన్న, కట్టమూరి నరేష్ కుమార్, రుత్తల అప్పలనాయుడు తదితరులు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులతో చింతకాయల రాజేష్ కొద్దిసేపు సమావేశమై క్లబ్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. సిటీ క్లబ్ ప్రతిష్ఠను మరింత పెంచేలా సమష్టిగా పనిచేయాలని, సేవా కార్యక్రమాల్లో ముందుండాలని నూతన కార్యవర్గానికి ఆయన సూచించారు.
నూతన బాధ్యతలు చేపట్టిన కార్యవర్గ సభ్యులు క్లబ్ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, సభ్యుల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు.