జూలై 15 నుంచి 23 వరకు వైభవంగా మహోత్సవాలు ప్రతిరోజు ప్రత్యేక కుంకుమ పూజలు.. తొమ్మిది అలంకరణల్లో భక్తులకు దర్శనం

నర్సీపట్నం, జూలై 13:(స్పీడ్ న్యూస్ )
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బైపాస్ రోడ్డులోని బలిఘట్టం వద్ద ఉన్న శ్రీ శ్రీ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో ఈ నెల 15వ తేదీ బుధవారం నుంచి 23వ తేదీ గురువారం వరకు శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు వారాహి అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు తొమ్మిది విభిన్న అలంకరణల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారని తెలిపారు.
ఈ మహోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
మరిన్ని వివరాల కోసం శేఖర్ స్వామి (9490036207), **మణికంఠ స్వామి (9030351845)**లను సంప్రదించవచ్చని తెలిపారు.