అనకాపల్లి జిల్లా నర్సీపట్నం
నర్సీపట్నంలోని గోసాల కేంద్రంలో ఏర్పాటు చేసిన పరికరాలకు సంబంధించి ఇటీవల జరిగిన ఒక ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గోసాల కేంద్రం నిర్వాహకుల అనుమతి లేకుండానే, ఒక ప్రైవేట్ క్లబ్ వారు తమకు నచ్చినట్లు పెయింటింగ్ వేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ప్రాంతంలోని గోసాల ప్రాంగణంలో ఉన్న పరికరాలకు సంబంధించి, నిర్వాహకుల అనుమతి లేకుండానే వాసవి క్లబ్ సభ్యులు వచ్చి పెయింటింగ్ వేయడం పట్ల వ్యాయామ కేంద్రం బాధ్యులు అసహనం వ్యక్తం చేశారు. తాము ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, అయినప్పటికీ తమ ప్రమేయం లేకుండానే ఇలా చేయడంపై ఆయన మండిపడ్డారు. గోసాల కేంద్రానికి చెందిన ఈ పరికరాలు ప్రభుత్వ విభాగం మరియు కేడిపేట ఆసుపత్రి నుంచి సమకూరాయని, వాసవి క్లబ్‌కు వీటితో ఎలాంటి సంబంధం లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. సుమారు రూ. 3,000 వాసవి క్లబ్ వారు గోసాల లో ఆవులు దాన నిమిత్తం అందించగా, మరికొన్ని పరికరాలను దాతల సహకారంతో ఏర్పాటు చేశామని, క్లబ్ నుంచి ఎటువంటి సహకారం అందలేదని ఆయన పేర్కొన్నారు.ఇది ప్రభుత్వ విభాగం ఆధీనంలో ఉన్న ఆస్తి అని, ఎలాంటి మార్పులు చేయాలన్నా ముందుగా సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన గుర్తు చేశారు.
నిర్వాహకుల డిమాండ్ ఈ పరికరాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం చూస్తోందని, నిబంధనలకు విరుద్ధంగా ఇలా వ్యక్తిగత క్లబ్ పేరును ప్రచారం చేసుకోవడం, అనుమతి లేకుండా పెయింటింగ్ వేయడం వంటి చర్యలను ఆయన ఖండించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు