* తప్పుడు ఫిర్యాదులపై పోలీసు విచారణ జరగాలి* * నిందలు నిజమని నిరూపిస్తే దేనికైనా సిద్ధం* * విచారణ అనంతరం సదరు మహిళపై పరువు నష్టం దావా: నర్సీపట్నం ప్రెస్ మీట్‌లో వెల్లడి

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం :(స్పీడ్ న్యూస్)

నర్సీపట్నం. తనపై కావాలనే కొందరు రాజకీయ కుట్రతో తప్పుడు ఆరోపణలు చేయిస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని నర్సీపట్నానికి చెందిన ఓ స్థానిక ప్రముఖుడు, ప్రైవేట్ కళాశాల భాగస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కళాశాల ఇతర ప్రతినిధులతో కలిసి జనసేన నాయకుడు అప్పన్న ఎన్ ఎస్ జి దొరబాబు మాట్లాడారు. బేరా కల్పన అనే మహిళ తనపై డీఎస్పీ కి తప్పుడు ఫిర్యాదు చేసిందని, ఈ విషయం పత్రికా విలేకరుల ద్వారానే తనకు తెలిసిందని పేర్కొన్నారు. తాను ప్రజా జీవితంలో ఉన్నాననే ఏకైక కారణంతోనే ఇటువంటి లేనిపోని అవాస్తవాలను ప్రచారంలోకి తెస్తున్నారని మండిపడ్డారు. బైక్ ఆరోపణలపై క్లారిటీ సదరు మహిళ తన ఫిర్యాదులో... తాను బైక్‌తో గుద్దేయడానికి ప్రయత్నించినట్లు పేర్కొనడం అత్యంత హాస్యాస్పదమన్నారు. తాను గత ఎనిమిదేళ్లుగా కనీసం మోటార్ సైకిల్ కూడా వాడటం లేదని, అలాంటప్పుడు తాను ఏ బైక్‌తో గుద్దానో, అసలు తాను ఏ బండి వాడుతున్నానో సదరు మహిళే సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. కేవలం తన వ్యక్తిగత ఇమేజ్‌ను, ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ తరహా అక్రమ నిందలు వేస్తున్నారని స్పష్టం చేశారు.
కళాశాల లావాదేవీల అసలు నిజాలు ఇవే..
గతంలో 2011వ సంవత్సరంలో కనబోయిన రాజు గారి వద్ద నుండి ఐదుగురు భాగస్వాములం కలిసి రూ. 23 లక్షల వ్యయంతో ఈ కళాశాలను కొనుగోలు చేశామని ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ కాలేజీ నలుగురు భాగస్వాములతో సజావుగా నడుస్తోందని, కానీ కావాలనే తన ఒక్కడినే టార్గెట్ చేస్తూ ఫిర్యాదు చేయడం వెనుక పెద్ద రాజకీయ కోణం దాగి ఉందన్నారు. రూ. 23 లక్షల విలువైన కాలేజీకి తాము రూ. 22 లక్షలు ఇచ్చామంటూ సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొనడం ఎంత అసంబద్ధంగా, హాస్యాస్పదంగా ఉందో అందరూ గమనించాలన్నారు.నిజానికి ఆ మహిళ భర్త కళాశాలకు సంబంధించి కేవలం రూ. 4 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారని, దానికి ప్రతిగా తాను చెక్ రూపంలో ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేశానని తెలిపారు. ఆ చెక్కును సదరు మహిళే తన సొంత బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. తమకు డబ్బులు ఇచ్చినట్లు సదరు మహిళ వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నా మీడియా ముందు చూపించాలని, నిజంగా ఆధారాలు ఉంటే తాను అంగీకరిస్తానని సవాల్ విసిరారు. కళాశాల సిబ్బందిని గానీ, నర్సీపట్నంలో తనతో తిరిగే ఎవరిని అడిగినా తన వ్యక్తిగత జీవితం, క్యారెక్టర్ ఎలాంటిదో చెప్తారని అన్నారు.పోలీసు విచారణ అనంతరం పరువు నష్టం దావా ఈ తప్పుడు ఫిర్యాదుపై పోలీసు అధికారులు లోతుగా విచారణ జరిపి నిజా నిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు. పోలీసుల ఎంక్వయిరీ పూర్తయి, ఈ ఆరోపణలు కేవలం అక్రమ నిందలని తేలిన వెంటనే సదరు మహిళపై చట్టపరంగా పరువు నష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేశారు. కేసు తేలిన తర్వాత ఖచ్చితంగా ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే తెర వెనుక ఉండి కొందరు ఈ కుట్రకు తెరలేపారని, త్వరలోనే అన్ని నిజాలు చట్టప్రకారం బయటకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కళాశాల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.