అనకాపల్లి జిల్లా నర్సీపట్నం (స్పీడ్ న్యూస్)
నర్సీపట్నం లో ఆభరణాల రంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ, వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్న ప్రముఖ సంస్థ 'వైభవ్ జ్యువెలర్స్' తాజాగా నర్సీపట్నంలో తన వినూత్నమైన 'గోల్డ్ ఆన్ వీల్స్' పథకాన్ని వైభవంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు వెలగ నారాయణరావు మాట్లాడుతూ, వైభవ్ జ్యువెలర్స్ ఎప్పుడు ఏది చేసినా వినూత్నంగా మరియు రికార్డులు బద్దలు కొట్టేలా చేస్తుందని కొనియాడారు. విశాఖ నుండి 23 నగరాలకు విస్తరణ గతంలో విశాఖపట్నంలో దాదాపు 200 జ్యువెలరీ షాపులు కేవలం నాన్-కేడీఎం బంగారాన్ని మాత్రమే విక్రయిస్తున్న తరుణంలో, వైభవ్ జ్యువెలర్స్ ఎంతో ధైర్యంగా కేడీఎం బంగారాన్ని వైజాగ్ ప్రజలకు పరిచయం చేసింది. ద్వారకానగర్‌లో సరికొత్త షోరూమ్‌తో ప్రారంభమైన వైభవ్ జ్యువెలర్స్ ప్రస్థానం, సంస్థ అధినేత మనోజ్ గారి అద్భుతమైన కృషి మరియు దూరదృష్టి వల్ల నేడు 23 నగరాలకు విస్తరించి కార్పొరేట్ స్థాయిలో అగ్రగామిగా నిలిచింది. వైభవ్ జ్యువెలర్స్ రాకతో విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ జ్యువెలరీ సంస్కృతి ఊపందుకుందని వారు గుర్తుచేశారు.
రాజసం ఉట్టిపడేలా 'గోల్డ్ ఆన్ వీల్స్'
పూర్వం రాజుల కాలంలో రోడ్లపై బండ్లపై మణులు, మాణిక్యాలు, బంగారం పెట్టి విక్రయించేవారని, అదే సరికొత్త ఆలోచనతో వైభవ్ జ్యువెలర్స్ ఈ 'గోల్డ్ ఆన్ వీల్స్' పథకానికి శ్రీకారం చుట్టింది.విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించినప్పుడు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందని, వందలాది మంది క్యూ లైన్లలో నిలబడి ఆదరించారని చెప్పారు. అదే ఉత్సాహంతో ఇప్పుడు నర్సీపట్నంలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు.సామాన్యుడికి అందుబాటులో ప్యూర్ గోల్డ్ ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, సామాన్యులకు సైతం స్వచ్ఛమైన బంగారం కొనే అవకాశాన్ని వైభవ్ జ్యువెలర్స్ కల్పించింది. కేవలం రూ. 900 లకే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు నాణేన్ని ఈ పథకం ద్వారా అందిస్తున్నారు. రాబోయే శ్రావణ మాస మహోత్సవాలను పురస్కరించుకుని ఈ సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. 50 మిల్లీగ్రాముల నుండి 500 మిల్లీగ్రాముల వరకు మొత్తం ఐదు రకాల సైజుల్లో ఈ నాణేలు లభ్యమవుతున్నాయి.పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లినప్పుడు రూ. 1000 లేదా రూ. 2000 నగదును చదువుల రూపంలో ఇచ్చే బదులు, ఈ స్వచ్ఛమైన బంగారు నాణేలను గిఫ్ట్‌గా ఇవ్వడం ఎంతో గౌరవప్రదంగా ఉంటుంది అని ఈ నాణేలను వైభవ్ జ్యువెలర్స్‌లోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా సరే 24 క్యారెట్ల మార్కెట్ ధర ప్రకారం నగదుగా మార్చుకునే లేదా ఇతర ఆభరణాలు కొనుగోలు చేసే సదుపాయం కలదు. ఇంతటి అద్భుతమైన, పారదర్శకమైన పథకాన్ని నర్సీపట్నం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.