జనసంద్రంగా మారిన నర్సీపట్నం ,భారీ ర్యాలీ. శ్రీకన్య కూడలి నుండి అబిద్ సెంటర్ ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ర్యాలీ
రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన శ్రీ చింతకాయల విజయ్ అభినందన సభ నర్సీపట్నంలో అత్యంత ఘనంగా జరిగింది. రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసి తొలిసారిగా నర్సీపట్నం వచ్చిన సందర్బంగా ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఆయన నర్సీపట్నం దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేలాది మంది ప్రజలు, అభిమానులు, కార్యకర్తల నడుమ భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. దారిపొడవునా ఇసుకవేస్తే రాలనంత జనసందోహంతో ఈ ర్యాలీ నర్సీపట్నంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో పలువురు రాజకీయ ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయ్ ను గజమాలలు, పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.