పార్లమెంట్ భవన్‌లో మర్యాదపూర్వక భేటీ.. ఏటికొప్పాక బొమ్మను జ్ఞాపికగా అందజేత

న్యూఢిల్లీ: ఆగష్టు 11 ( స్పీడ్ న్యూస్ )
భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్‌ను మంగళవారం పార్లమెంట్ భవనంలోని ఆయన ఛాంబర్‌లో రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్, నర్సీపట్నం టీడీపీ అధ్యక్షులు చింతకాయల రాజేష్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చింతకాయల విజయ్, చింతకాయల రాజేష్‌లు ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం నర్సీపట్నం ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన ప్రసిద్ధ ఏటికొప్పాక బొమ్మను ఉపరాష్ట్రపతికి జ్ఞాపికగా అందజేశారు.
ఏటికొప్పాక కళకు జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం
ఏటికొప్పాక బొమ్మలు సహజ రంగులు, సంప్రదాయ తయారీ విధానం, కళాకారుల నైపుణ్యంతో ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఈ కళాకృతిని ఉపరాష్ట్రపతికి అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ కళలు, సంస్కృతి, హస్తకళల విశిష్టతను జాతీయ స్థాయిలో చాటిచెప్పినట్లు అయింది.
నర్సీపట్నం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పార్లమెంట్ వేదికగా ప్రస్తావిస్తూ, నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని చింతకాయల విజయ్ తెలిపారు. ఉపరాష్ట్రపతితో జరిగిన ఈ భేటీ మర్యాదపూర్వకంగా, ఆత్మీయ వాతావరణంలో సాగింది.
ఈ కార్యక్రమం ద్వారా నర్సీపట్నం ప్రాంత ప్రత్యేకత అయిన ఏటికొప్పాక కళకు మరింత ప్రాచుర్యం కల్పించే ప్రయత్నం జరిగిందని టీడీపీ నాయకులు తెలిపారు.