నర్సీపట్నం ( స్పీడ్ న్యూస్)
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో న్యూ టీమ్ ఆర్యవైశ్య మిత్రుల ఆధ్వర్యంలో లోక కల్యాణార్థం మరియు గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షూస్తూ అమ్మవార్లకు ఆషాడ సారి సమర్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా,విజయవంతంగా నిర్వహించబడింది.
గ్రామంలోని ఐదుగురు అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఆర్యవైశ్య మిత్రులందరూ అపూర్వమైన సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొన్న చింతకాయల పద్మావతికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.సహకరించిన ప్రముఖులు మరియు దేవాలయ కమిటీలు
ఈ కార్యక్రమానికి అన్నివిధాలా సహకరించి,ఆర్యవైశ్యులందరినీ దగ్గరుండి ఆహ్వానించి ఆదరించిన ప్రముఖులకు కమిటీ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలియజేశారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం చైర్మన్ దేవత కామేష్ మరిడి మహాలక్ష్మి అమ్మవారి దేవాలయ చైర్మన్ జాలుమూరి జోగారావు నూకాలమ్మ తల్లి అమ్మవారి దేవాలయ చైర్మన్ కొరుప్రోలు శ్రీను దుర్గాదేవి అమ్మవారి దేవాలయ చైర్మన్ జంపాన నాగేంద్ర రాజు మహాలక్ష్మి దేవి అమ్మవార్ల దేవాలయ పర్యవేక్షకులు సూరిబాబు మాస్టర్, ఎస్.వి.ఎస్. కృష్ణ
వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి సేవా ట్రస్ట్ ప్రతినిధులు అలాగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయానికి, దుర్గాదేవి దేవాలయానికి ఆషాడసారీ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్యవైశ్య మహాసభ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ప్రత్యేక అభినందనలు ఈ కార్యక్రమ నిర్వహణలో కమిటీకి వెన్నెముకగా నిలిచి సలహా సూచనలతో ముందుకు నడిపించిన వెలగ నారాయణ రావు, వినాయక చిన్న బాబులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే, కార్యక్రమంలో ఎంత బడ్జెట్ మిగిలితే అంత పంపించమని, మిగతా మొత్తం తాను భరిస్తానని భరోసా ఇస్తూ తుని నుండి ప్రత్యేకంగా భోజనాలు పంపించిన వరద అప్పలరాజు కేటరింగ్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏమైనా చిన్నపాటి లోటుపాట్లు ఉంటే పెద్దమనసుతో అర్థం చేసుకుని, మీ సలహాలు సూచనలతో తదుపరి కార్యక్రమాలలోనూ తమను ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరారు. త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన జమ-ఖర్చుల వివరాలను అందరికీ తెలియజేస్తామని వెల్లడించారు