ప్రతి ఆర్యవైశ్య కుటుంబం సభ్యత్వం పొందాలని నాయకుల పిలుపు

నర్సీపట్నం:జులై31( స్పీడ్ న్యూస్)
నర్సీపట్నంలో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆగస్టు 2వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన పాంప్లెట్‌ను శుక్రవారం ప్రముఖుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా సెక్రటరీ తమ్మన సుబ్రమణ్య గుప్తా, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ సి.ఎస్. కుమార్, ఈసీ సభ్యులు పద్మనాభుని బాల కన్నయ్య శెట్టి, దాసరి కామేశ్వరరావు (మాస్టారు), తవ్వ వెంకటేష్, ధనం (మాస్టారు), వూడ రాము, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కుసుమంచి కృష్ణ, పీఆర్వో దేవత కామేష్, సభ్యుడు పచ్చిగోళ్ళ రాంజీ, నర్సీపట్నం ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు శిరం లక్ష్మణరావు, కార్యదర్శి పచ్చిపులుసు రాంబాబు, ఖజాంచి కనకరాజు, గ్రంధి రామకృష్ణతో పాటు స్థానిక ఆర్యవైశ్య బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.వై
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నర్సీపట్నంలోని ప్రతి ఆర్యవైశ్యుడు మహాసభ సభ్యత్వాన్ని పొందాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు ద్వారా సమాజంలో ఐక్యత మరింత బలోపేతం అవుతుందని, ఆర్యవైశ్యుల హక్కులు, సంక్షేమం, సేవా కార్యక్రమాల విస్తరణకు సభ్యత్వం ఎంతో దోహదపడుతుందని తెలిపారు.
ఆర్యవైశ్య సమాజం మరింత సంఘటితంగా ముందుకు సాగాలంటే ప్రతి కుటుంబం సభ్యత్వం పొందాలని, యువత కూడా మహాసభ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు. ఆగస్టు 2న నిర్వహించే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.