అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జులై25( స్పీడ్ న్యూస్)

తొలి ఏకాదశి పర్వదినాన నర్సీపట్నం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన దేవాలయంలో నూతన పాలకమండలి ఆధ్వర్యంలో 58 జంటలతో ఆలయ పురోహితులు కాసుబాబు పవన్ గార్ల సారధ్యంలో సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రతాలు అత్యంత వైభవంగా శాస్త్ర యుక్తంగా నిర్వహించారు ..
అనంతరం తొలి ఏకాదశి విశిష్టతను, తొలి ఏకాదశి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలను ఆలయ ప్రధాన అర్చకులు కాసుబాబు వివరించారు.. కమిటీ వారు వ్రతంలో పాల్గొన్న 8 జంటలకు లక్కీ డ్రా ను నిర్వహించారు. విజేతలకు చీరలు, పంచె ధోవతిలను బహుకరించారు..

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ దేవత కామేష్,
కార్యదర్శి గ్రంధి మురళీకృష్ణ
మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు... ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆలయ చైర్మన్ కామేష్,అరుణ దంపతులు కృతజ్ఞతలను తెలియజేస్తూ ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమానికి కులమత బేధములు లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొన వచ్చునని నర్సీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు పిలుపునిచ్చారు.