స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారి నేతృత్వంలో నర్సీపట్నం ప్రగతి పథం: చింతకాయల పద్మావతి*
గొలుగొండ మండలంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. జీ కొత్తూరు సెంటర్ నుంచి గుండిపాల తలపులమ్మ తల్లి ఆలయం వరకు రూ. 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న 2 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి పనులను ఆమె ప్రారంభించారు.
అనంతరం చింతకాయల పద్మావతి మాట్లాడుతూ, నర్సీపట్నం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. కేవలం రెండు సంవత్సరాల స్వల్ప కాలంలోనే నియోజకవర్గ అభివృద్ధి కోసం సుమారు 532 కోట్ల రూపాయలు మంజూరు చేయించి వివిధ సంక్షేమ, అభివృద్ధి పనులను చేపట్టారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఒక్క గొలుగొండ మండలంలోనే 413 అభివృద్ధి పనులకు గాను రూ. 45 కోట్ల 40 లక్షల నిధులను వెచ్చించినట్లు ఆమె వివరాలను వెల్లడించారు.
ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కొల్లు రాంబాబు, కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ సాంబమూర్తి, సత్యనారాయణ, కామిరెడ్డి గోవింద్ , కోఆపరేటివ్ డైరెక్టర్ కొరిపల్లి నూకరాజు నాయుడు, రవివర్మ, గుమ్మడి చిన్నారావు, పార్టీ ప్రెసిడెంట్ కూండ్రపు నాని, రావణపల్లి పార్టీ ప్రెసిడెంట్ సత్యనారాయణతో పాటు పలువురు స్థానిక నాయకులు, మహిళలు కార్యకర్తలు విశేషంగా పాల్గొన్నారు.
31 Jul 2026